![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు 'ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-494 లో.. ధీరజ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడని వేదవతి ఏడుస్తుంది. అక్కడే అమూల్య ఉండి ఓదారుస్తుంది. ధీరజ్ కి ఏం కాదు బెయిల్ వస్తుందని అమూల్య చెప్తుంటే వేదవతి ఏడుస్తూనే ఉంటుంది. మరోవైపు రామారాజు కోర్ట్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. చందు వచ్చి రామరాజుకి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత చందు, రామరాజు ఇద్దరు వేదవతి దగ్గరికి వస్తారు.
పదా బుజ్జమ్మా కోర్టుకి అని రామరాజు అనగానే నేను రాను.. అక్కడికి వస్తే నా గుండెపగిలి చస్తానని వేదవతి అంటుంది. అవేం మాటలే అని రామారాజు అనగానే నేను రాను.. చిన్నోడిని కోర్టులో చూడలేనని వేదవతి ఎమోషనల్ అవుతుంది. దాంతో రామరాజు తనకి ధైర్యం చెప్తాడు. ఇక రామరాజు, చందు ఇద్దరు ముందుగా పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అక్కడ ఎస్ఐ చాలా దురుసుగా మాట్లాడతాడు. ధీరజ్ ని అవమానిస్తుంటాడు. అప్పుడే రామరాజు, చందు వచ్చి ధీరజ్ తో మాట్లాడుతుంటారు. నాకేం కాదు నాన్న.. మీరు ధైర్యంగా ఉండండి అని ధీరజ్ అనగానే ఈ టైమ్ లో కూడా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావ్ రా చిన్నోడా.. నీ గురించి ఏం ఆలోచించవా అంటూ రామరాజు ఎమోషనల్ అవుతాడు. మరోవైపు ఆనందరావు, భాగ్యం ఇద్దరు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ధీరజ్ ని కోర్ట్ కి తీసుకెళ్తున్నారని భాగ్యం, ఆనందరావు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు. అప్పుడే భాగ్యానికి సుకన్య ఫోన్ చేసి.. ఆ ప్రేమ, నర్మద ఇద్దరు కలిసి ఆ మామిడికాయలు కార్ లోకి తీసుకొని వచ్చిన వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్తుంది. దాంతో భాగ్యం, ఆనందరావు టెన్షన్ పడతారు. దాంతో వాళ్ళిద్దరు పరుగున నర్మద, ప్రేమల దగ్గరకి వస్తారు. నర్మద, ప్రేమ ఇద్దరు ఆ రౌడీని పట్టుకోవాలని వాడి వెనకాల నెమ్మదిగా ఫాలో అవుతారు. అమ్మో.. వాళ్ళు వాడిని పట్టుకునేలా ఉన్నారని ఆనందరావు అనడంతో ఇప్పుడు చూడు ఏం చేస్తామో అంటూ ప్రేమ, నర్మదల కన్నా ఫాస్ట్ గా వెళ్ళి.. ఒరేయ్ ఆగరా అంటూ భాగ్యం గట్టిగా అరుస్తుంది. అది విన్న రౌడీ వెనక్కి చూసి వేగంగా పరుగెడతాడు. దాంతో నర్మద, ప్రేమలకి అందకుండా పోతాడు.
అసలు మీరెందుకు వచ్చారంటూ భాగ్యం, ఆనందరావులని నర్మద, ప్రేమ తిడుతారు. మీకు హెల్ప్ చేయడానికి అని భాగ్యం వాళ్ళు అంటారు. మీరేం చేయనవసరం లేదని ప్రేమ, నర్మద వాడి వెంట పడతారు. మరోవైపు ధీరజ్ ని ఎస్ఐ పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకి తీసుకొని వస్తాడు. అప్పుడే ఆ మామిడికాయలు కారులోకి తీసుకొని వచ్చిన రౌడీని లాక్కొచ్చి పడేస్తారు నర్మద , ప్రేమ. దాంతో వీడు నిజం చెప్పేశాడా ఏంటి అని ఎస్ఐ తనలో తానే టెన్షన్ పడతాడు. వీడే సర్ .. ఆ మాధక ద్రవ్యాలు కారులోకి తీసుకొచ్చిందని నర్మద, ప్రేమ అనగానే ఎవడినో తీసుకొచ్చి ఇలా చెప్తే మేం నమ్మేస్తామా అని ఎస్ఐ అంటాడు. సాక్ష్యం ఉందని సీసీటీవి ఫుటేజ్ చూపిస్తారు నర్మద, ప్రేమ. ఏంటి ఇదంతా నమ్మాలా.. వాళ్ళిద్దరు పార్టనర్స్ ఏమో.. ఇదంతా కావాలని క్రియేట్ చేశారేమో.. దానికంతా ఒక ప్రొసీజర్ ఉంటుందని ఎస్ఐ అనగానే నర్మద, ప్రేమ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |